గత ప్రభుత్వం హయాంలో విపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అలియాస్ ప్రణీత్‌కుమార్ అరెస్టయ్యారు. పంజాగుట్ట పోలీసులు ఆయనను రాజన్న- సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్ ట్యాపింగ్, కంప్యూటర్ ధ్వంసం కేసులో ప్రణీత్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రణీత్‌రావు ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ప్రణీత్ రావు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్బీఐ అదనపు ఎస్పీ డి రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ప్రణీత్‌రావు సస్పెన్షన్‌కు మునుపు రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు. అయితే, సస్పెన్షన్ తరువాత జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఆదేశించారు. ప్రణీత్ రావును అరెస్ట్ చేసి పంజాగుట్ట ఠాణాలో విచారణ చేస్తున్నారు. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లో ఏ సమాచారం ఉంది? అనే కోణాల్లో ఆయనను విచారిస్తున్నారు.
Tag:
intelligence bureau
యూపీలోని అయోధ్యలో ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక హెచ్చరిక జారీ చేసింది. అయోధ్యలో ఓ ఉగ్రవాది ఉన్నాడని, పలు ప్రాంతాలతో పాటు రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో యోగి సర్కార్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది. 10,715 అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కెమెరాలతో పాటు యాంటీ డ్రోన్ టెక్నాలజీని సిద్ధం చేసింది.