ఎంతోమంది ఆయుష్షుని పెంచాలని ఒక దృఢ సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. కృష్ణాజిల్లా మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. బీద బడుగు బలహీన వర్గాలు, అగ్ర కుల పేదవారికి జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఎన్నికలకు వెళ్లి ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, మరల ప్రజలను ఎలా మోసం చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు మోడీ, అమిత్ షా వెంట పడుతున్నాడని ఎద్దేవా చేసారు.
jagan
ఈ నెల 28న జనసేన-టీడీపీ సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు? హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలన్నారు. జనసేన, టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం అని నాదెండ్ల అన్నారు.
ఒంగోలు జిల్లా(Ongole) ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చారని, కానీ మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని విమర్శించారు. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందన్నారు.
500గ్యాస్ , గృహ జ్యోతి పథకాలపై రేవంత్ కీలక ప్రకటన
రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కులు కల్పించామని జగన్ తెలిపారు. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టామన్నారు. వైద్య రంగంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ 40 సంవత్సరాల కాలంలో కుప్పం ప్రాంతానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదని, విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందజేయాలనే ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తుంటే అన్నిటికీ ఆటంకాలు చంద్రబాబు నాయుడు కలిగిస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప విమర్శలు చేశారు. హంద్రీనీవా ద్వారా కుప్పం ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఘనత చంద్రబాబునాయుడునె, పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబునాయుడు అని విమర్శించారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అందుకే మేమంతా కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీలో చేరామని, కాంగ్రెస్ పార్టీకు అనేక సేవలు అందించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత అనేక నింధలు వేశారని, అలాంటి పార్టీలో చేరిన వైఎస్ షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డిని విమర్శనం సరికాదని అన్నారు. కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కావడంతో, మేమంతా ఆమెను విమర్శించకుండా పోతున్నామని తెలిపారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖడ్గరే, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరవుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాలో చేపట్టేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ సభలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాకు సాగునీరు తాగునీరు అందించేందుకు శాయశక్తుల కృషి చేశామన్నారు. హంద్రీనీవా పథకం, కస్తూరిబా పాఠశాలలు నిర్మించామన్నారు. ముఖ్యంగా రాప్తాడు ముఖ్యమంత్రి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై జరిగిన దాడి అమానుషమని పేర్కొన్నారు. పాత్రికేయులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం 600 హామీలు యిచ్చి కనబడిన ప్రతి ఊరు, జిల్లా ప్రతి కులానికి మ్యానిఫెస్టోలో పెట్టలేనివి కూడా పిట్టల దొర సామెత గా వేల సంఖ్యలో చంద్రబాబు హామీలు యిచ్చారు. ఉదాహరణకు బందరు చూసుకుంటే పోర్ట్ 6 నెలల్లో పూర్తిచేశాను అన్నాడు చేశాడా ? కనీసం పనులు అయినా మొదలు పెట్టారా… ఆక్వా హబ్ గా మచిలీపట్నం చేస్తాను అన్నాడు ఏమైంది. 3 సెంట్ల యిళ్ల స్థలాలు యిస్తనన్నాడు 3 గజాలు అయినా యిచ్చాడా… 2019 ఎన్నికల్లో హైద్రాబాద్ నుండి నిరుద్యోగులు మచిలీపట్నం వలస వస్తారు అన్నారు ఏమైంది. మచిలీపట్నానికి కాకుండా రాష్ట్రానికే కొన్ని వేల హామీలు యిచ్చేసి వాటి నీ తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. మ్యానిఫెస్టోలో లో యిచ్చిన హామీలను కానీ, యివ్వని హామీలను సైతం నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి నీ తప్పు పడతారా. గురివింద గింజ కు క్రింద మాత్రమే నలుపు వుంటుంది ఈ రాజకీయ గురివింద చంద్రబాబు కి వళ్ళంతా మచ్చే జగన్మోహన్ రెడ్డి నీ తప్పు పట్టే అర్హత చంద్ర బాబుకు లేదు. ప్రజల్లో వున్న మాట ఏంటో తెలుసా ఎన్నికల ముందు హామి యిస్తాడు అధికారం లోకి వచ్చాక మోసం చేస్తాడు అని ప్రజల మాట..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్దమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ?’ అంటూ ప్రశ్నించారు. ‘నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది.. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు అంటూ మండిపడ్డారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్‌కు పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం.. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ‘ప్లేస్, టైం.. నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!’అని ప్రశ్నించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.by CVR NEWSఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.by CVR NEWSఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.by CVR NEWSకోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టాలి అనడం, అంబేద్కర్ ను అవమానించడమే అని వైసీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ రాజ్యాంగ సృష్టికర్తను గౌరవించక పోయిన పరవా లేదు అవమానించకండి అన్నారు. జగన్ పార్టీలో నేతలందరూ ఇంతేనా ఎలక్షన్ ముందు దళితులను ముద్దులు పెట్టుకుని ఇప్పుడిలా మాట్లాడడం బాధాకరం. అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం పెట్టడం కాదు జూపూడి ప్రభాకర్ మాటలను జగన్, వైసీపీలోని నేతలు ఎందుకు ఖండించరు అంటూ జనసేన దళితనాయకులు తిరుపతి ఇంచార్జ్ తీవ్రంగా ఖండించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.by CVR NEWSఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.by CVR NEWSఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.by CVR NEWSకోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
విశాఖపట్నంను ఐటీ క్యాపిటల్ గా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ ప్రభుత్వం సిటీని గంజాయి క్యాపిటల్ గా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ ప్రసంగించారు. నాడు చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని విశాఖకు తీసుకొస్తే.. ప్రస్తుతం జగన్ పాలనలో నగరంలో రోజుకో హత్య, కిడ్నాప్, కుంభకోణం జరుగుతున్నాయని లోకేశ్ ఆరోపించారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారని జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.by CVR NEWSఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.by CVR NEWSఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.by CVR NEWSకోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంబేడ్కర్ విదేశీ విద్య’ పేరును ముఖ్యమంత్రి జగన్ మార్చడాన్ని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ సమర్థించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అంబేడ్కర్ పేరును తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే. టీడీపీ హయాంలో అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇస్తోంది. గతంలో కంటే డబ్బులు పెంచినందున అంబేడ్కర్ పేరును తీసేసినా తప్పుకాదు. జగన్ పేరు పెట్టుకున్నా, తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టుకున్నా తప్పు కాదు. తమకు డబ్బులే ముఖ్యం. అంబేడ్కర్ పేరు కాదు అని వ్యాఖ్యానించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.by CVR NEWSఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.by CVR NEWSహైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.by CVR NEWSఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…

Total views : 90959