అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టాలి అనడం, అంబేద్కర్ ను అవమానించడమే అని వైసీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ రాజ్యాంగ సృష్టికర్తను గౌరవించక పోయిన పరవా లేదు అవమానించకండి అన్నారు. జగన్ పార్టీలో నేతలందరూ ఇంతేనా ఎలక్షన్ ముందు దళితులను ముద్దులు పెట్టుకుని ఇప్పుడిలా మాట్లాడడం బాధాకరం. అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం పెట్టడం కాదు జూపూడి ప్రభాకర్ మాటలను జగన్, వైసీపీలోని నేతలు ఎందుకు ఖండించరు అంటూ జనసేన దళితనాయకులు తిరుపతి ఇంచార్జ్ తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి…