నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందించింది. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. సాగర్ డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోనున్నాయి. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సాగర్ డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి.
nagarjunasagar
ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్యామ్పైకి వచ్చారని అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసులుతో పాటు ఇరిగేషన్ అధికారులపై కూడా కేసులు కేసులు నమోదు చేశారు.రెండు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు నాలుగువేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకున్నారు.
నల్గొండ : నాగార్జునసాగర్ వద్ద రెండో రోజు కొనసాగుతున్న హైటెన్షన్. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై కొనసాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు పాటించని ఏపీ ప్రభుత్వం. ఏపీ వైపు భారీగా మోహరించిన ఏపీ పోలీసులు. సాగర్ నుంచి మాచర్ల వైపు వచ్చే వాహనాలు అడ్డుకుంటున్న ఏపి పోలీసులు. డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్న టీఎస్ పోలీసు బలగాలు. నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేసుకున్న ఏపి అదికారులు. ఇప్పటికే గంటకు 500 క్యూసెక్కుల చొప్పున సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదల. ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం. పట్టువీడని ఏపి ప్రభుత్వం. ఎన్నికల సమయం కాబట్టి ఎటూ తేల్చుకోలేక పోతున్న తెలంగాణ ప్రభుత్వం.




Total views : 149926