మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మెట్రో విస్తరణ జరిగేచోట బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు. సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంతి కిషన్‌రెడ్డి సమయం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడాలని సూచించారు.మెట్రో విస్తరణకు కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. లోన్ బదిలీ కాకుండా కిషన్‌రెడ్డి వల్లే మెట్రో విస్తరణ ఆగిందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు 40 వేల కోట్ల రూపాయలు కావాలని సూచించారు. అంతా తామే భరిస్తామని.. NOC ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా మెట్రోను తాము విస్తరిస్తామని కేంద్ర పెద్దలతో తాము చెప్పామని పేర్కొన్నారు
మెట్రోస విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి-సీఎం రేవంత్‌రెడ్డి.
316