Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News ఎల్‌బీ నగర్‌లో తాగునీటి సమస్యపై బీజేపీ ఆందోళన.

ఎల్‌బీ నగర్‌లో తాగునీటి సమస్యపై బీజేపీ ఆందోళన.

by CVR NEWS
ఎల్‌బీ నగర్‌లో తాగునీటి సమస్యపై బీజేపీ ఆందోళన

హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు జలమండలి హయత్‌నగర్ సీజీఎం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ ఎల్‌బీ నగర్ అసెంబ్లీ ఇంచార్జి సామ రంగారెడ్డి నాయకత్వం వహించారు. నియోజకవర్గంలోని అనేక కాలనీలు, బస్తీలు, నివాస ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.వారానికి ఒకసారి కూడా సక్రమంగా నీరు అందని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల సామాన్య కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, సంబంధిత అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు విమర్శించారు.అనంతరం జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేసి, ఎల్‌బీ నగర్ ప్రజలకు నిరంతరాయంగా తగిన మోతాదులో తాగునీటి సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: