Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి సీతక్క.

ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి సీతక్క.

by CVR NEWS

హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న “ప్రజలతో ముఖాముఖి” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజా పాలనలో ప్రజల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: