Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం

ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం

by CVR NEWS
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ, కొత్త కమిటీల ఏర్పాటు, పార్టీ ఇంచార్జీల నియామకంపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలపై పోరాటం, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడంపై చర్చ జరిగింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: