Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra PradeshChittoor మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

by Rama
Police

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం సాయి నగర్, కెనరా బ్యాంకు వెనుక వైపు శుక్రవారం ఓ మహిళ హత్యకు గురైన విషయం విధితమే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును 48 గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు, నేడు హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు.. అనంతపురం జిల్లా గుంతకల్ టౌన్ కు చెందిన లక్ష్మీ 57 సంవత్సరాలు, గత పది సంవత్సరాలుగా పలమనేరు గంగవరం పరిధిలో స్థానికంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఏరుకుంటూ వాటిని గుజిరి షాపుల్లో అమ్ముకొని జీవనం సాగించేది, ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన
మేస్త్రి మంజునాథతో పరిచయమైంది, ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉన్నందువలన ఇద్దరు కలిసి మద్యం సేవించి, గంగవరం కెనరా బ్యాంక్ వెనుక నూతనంగా నిర్మిస్తున్న ఇంటిలో శారీరకంగా కలిశారు, నానా రకాలుగా సెక్స్ చేయాల్సిందిగా లక్ష్మిని మంజునాథ్ కోరాడని ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉన్న సారవ కొయ్యతో మొఖం పగలగొట్టి, పక్కనే ఉన్న డ్రమ్ములో తలకిందులుగా పడవేసి వెళ్లిపోయాడని, ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అధికారులు తెలిపారు, కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ కృష్ణమోహన్ ఎస్ఐ ప్రతాప్ ను, మరియు పోలీసు సిబ్బంది ని డిఎస్పి సుధాకర్ రెడ్డి అభినందించారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: