సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ ఆయన పర్యటించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట తప్పారని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని.. తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడని.. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయని.. తెలంగాణ సర్కారు ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అవినీతిమైందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాఫెల్, కామన్వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎరువులు సబ్సిడీకి అందిస్తామన్నారు.
కేసీఆర్ పై నడ్డా తీవ్ర ఆరోపణలు..
238
previous post





Total views : 80634