Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh ఇవి భోగి మంటలు కాదు మా కడుపు మంటలు…

ఇవి భోగి మంటలు కాదు మా కడుపు మంటలు…

by Prakash
Burn the show cause notices in the bonfire

అంగన్వాడి టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 32 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 33 రోజుకు చేరింది. అందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరం వద్ద రోడ్డు పైన సంక్రాంతి పండుగ భోగి మంటలు వేసి తమకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఆ భోగి మంటల్లో వేసి దహనం చేస్తూ తమ నిరసన కార్యక్రమం చేపట్టారు. భోగి మంటలు కాదు ఇవి అంగన్వాడిల కడుపు మంటలు అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్ల సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు కాలంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం స్థానిక కళాకారుడు సినీనటుడు నాగేశ్వరరావు పాటలకు నృత్యం చేస్తూ తమ కళను ప్రదర్శించి మద్దతు తెలిపారు. అంగన్వాడి టీచర్లు చేస్తున్న నిరసన సమ్మెకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: