Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Latest News ఓట్లు వేయించుకోవడం కాదు పనులు కూడా చెయ్యాలా…

ఓట్లు వేయించుకోవడం కాదు పనులు కూడా చెయ్యాలా…

by Prakash
Women


మహిళలు (Women) ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన..

ఓట్లు వేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో చూపడం లేదని మహిళలు (Women) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కాలనీ కి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు. గత పాలకుల తప్పిదాలతో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని, ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మహిళలందరూ ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించిన మహిళలు..

సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు. 1983 లో ఏర్పడిన తమ కాలనీకి త్రాగునీరు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

మున్సిపల్ మేనేజర్ నిర్మలా రెడ్డి కి వినతి పత్రం..

కాలనీలో మంజీరా నీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు లేవని వాపోయారు. గతంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, లోకాయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. గత 30 ఏళ్లుగా ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యలు వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడి పోయామన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలా రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019588
Total views : 91182

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.