Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి

బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి

by Satya


వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కర్నూలు జిల్లా(Kurnool District)లోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy), మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లంచాలు అడిగేవారు లేరని.. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా.. కులమతాలకు అతీతంగా, ఏ పార్టీ అని చూడ కుండా, చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకొని, అర్హత ఉంటే వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికి మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ అని హర్షం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: 2024- 25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం

ఇక మీ బిడ్డ బటన్ నొక్కడం, అక్క చెల్లెమ్మల అకౌంట్ లోకి డబ్బులు జమ అవ్వడం ఇలా తుగ్గలిలో 95శాతం ఇల్లకు వైసీపీ లబ్ది చేకూర్చిందని పేర్కొన్నారు. ఎక్కడ లంచాలు లేకుండా.. వివక్షలు చూపకుండా ఇలా చేసే పరిస్థితి ఉంటుందని గత ఐదేళ్లకు ముందు ఎవరైనా మీతో చెప్పారా అని ప్రశ్నించారు. జన్మ భూమి కమీటీలు రాజ్యమేలుతున్న సమయంలో ఏ పని కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, సబ్సీడీ పైన ఇచ్చే లోన్లు కావాలన్న, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలనను ప్రజలు చూసారని టీడీపీని విమర్శించారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039487
Total views : 197121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: