Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.

by CVR NEWS

పసిడి ప్రియులకు ఇదే చౌక భేరం. ఇలాంటి మంచి అవకాశం మళ్లీ రాదంటున్నారు. బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజుపతనం కాదు పాతాళానికే పడిపోయాయి. గత కొంతకాలంగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి, ఇప్పుడు ఒక్కసారిగా దిగిరావడంతో పసిడి ప్రియులు ఎగిరిగంతేస్తున్నారు. ఒక వైపు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు దిగిరావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. . హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 5,950 మేర తగ్గింది. దీంతో నిన్నటి వరకు గరిష్టాల్లో ఉన్న ధర ఇప్పుడు రూ. 1,40,020 వద్దకు చేరింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 5,450 పతనమై రూ. 1,28,350 పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం మరింత తీవ్రతరమవుతున్నప్పటికీ బంగారం ధరలు పడిపోతున్నాయి. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. ధరలు మరింత తగ్గుతాయా లేదా అన్న ఆందోళన పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న ఈ తగ్గుదల కొనుగోలుదారులకు నిజంగానే ‘గోల్డెన్ ఛాన్స్’ అని చెప్పవచ్చు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: