Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh కాకినాడ కు తుఫాన్ హెచ్చరిక…

కాకినాడ కు తుఫాన్ హెచ్చరిక…

by Prakash
Typhoon Michoung

మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. మరోవైపు, ఆఫ్‌లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జడ్పీ హైస్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్‌ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేశారు. నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు

Advertisements

You may also like

Our Visitor

026045
Total views : 149775

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.