Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు..

నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు..

by Rama
Out Sourcing Workers strike

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. రెండు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. విషయం తెలుసుకున్న పురపాలక సంఘం కమిషనర్ అక్కడికి చేరుకొని కార్మికులను సముదయించే ప్రయత్నం చేసినప్పటికి కార్మికులు పట్టించుకోలేదు. రెండు నెలల వేతనాలతో పాటు తమకు రావాల్సిన పీఆర్సి బకాయిలను చెల్లించే వరకు విధులల్లో చేరబోమని స్పష్టం చేశారు. చెత్త సేకరణ వాహనాలు తీయకుండా కార్యాలయం లోపలే ఉంచి కార్యాలయ గేటు ముందు ధర్నాకు దిగారు. తమకు రావాల్సిన వేతనాలు ఇచ్చే వరకు విధుల్లో చేరబోమని తేల్చి చెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: