Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra PradeshChittoor హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు..

హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు..

by Rama
Nagari Police Station

Murdercase:

చిత్తూరు (Chittoor) జిల్లా.. నగరి మున్సిపాలిటీ పరిధిలోని హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. నెత్తం కండ్రిగ లక్ష్మీపురంలో ఈ నెల 3వ తేదీన వాటర్‌ప్లాంట్‌ యజమాని ఎం.జగధీష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపిన కేసును నగరి పోలీసులు సవాలుగా తీసుకొని 9 రోజుల్లో చేధించారు. హత్యలో పాత్రదారులైన నెత్తం కండ్రిగకు చెందిన సుధాకర్‌, సత్యవేడు, దాసుకుప్పంకు చెందిన మురళి, తిరువళ్లూరు రామదాసుపురంకు చెందిన యస్‌.మగేష్‌ తిరుపాచూరుకు చెందిన ఎ.అజిత్‌, కడంబత్తూరు అధిగాత్తూరుకు చెందిన హరిహరన్ కుమార్‌ అలియాస్‌ వసంత్‌ సూట్‌సూరి, రాజముత్తు మనవాల్‌నగర్‌కు చెందిన జయశంకర్‌ బాలాజి లను అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ నరసింహమూర్తి తెలిపిన వివరాల మేరకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమైందని, ఆ కోణంలోనే సుధాకర్‌ అనే వ్యక్తిపై అనుమానంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు సోమవారం ఉదయం గుండ్రాజుకుప్పం డంపిగ్‌ యార్డువద్ద సుధాకర్‌ను అతనితో పాటు ఉన్న ఏడుగురిని అదుపులో తీసుకొని అసలు విషయాన్ని రాబట్టారు. సుధాకర్‌ అద్దెకున్న ఇంటి యజమాని జగధీష్‌కు వివాహేతర సంబందం ఏర్పడం ఈ కారణంగా వివాదాలు, గొడవలు ఏర్పడి సుధాకర్‌ భార్యకు విడాకులకు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయినా మానసికంగా జగధీష్‌పై సుధాకర్‌ కక్షపెంచుకున్నాడు. తనకు వరుసకు సోదరుడైన సత్యవేడు మండలం, దాసుకుప్పం గ్రామానికి చెందిన మురళితో జగదీష్‌ను చంపేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం మేరకు మురళి తన సన్నిహితుడైన మగేష్‌ ద్వారా తమిళ్‌ నాడుకు చెందిన అజిత్, హరిహరన్, వసంత్, సూరి, ముకేష్‌లను రంగంలోకి దింపి హత్యకు పథకరచన చేశాడు. 3వ తేది రాత్రి జగధీష్‌ కారుదిగి ఇంటికి వెళ్లేసమయంలో అక్కడే పొదల చాటున దాక్కున్న వసంత్‌ వేటకత్తితో మృతినిపై దాడిచేయడంతో జగధీష్‌ మృతిచెందాడు. విచారణలో నిందితుల వద్ద నుంచి రూ.1.37 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, వేటకత్తిని స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరిచాము అన్నారు. కేసును త్వరగా చేధించిన సీఐ సురేష్‌ను డీఎస్పీ ప్రశంసించారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

039862
Total views : 201081

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: