అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం యానాదపల్లి అరుంధతి వాడలో నాబార్డ్ శ్రీలికి ఆధ్వర్యంలో సుమారు 60 మందికి రాజు రాణి బొమ్మల శిక్షణ ఎన్ శివయ్య, ఈశ్వరయ్య, వెంకటయ్య గురువులచే 60 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 25 సంవత్సరాల నుండి ఈ రాజు రాణి బొమ్మలు శిక్షణ జరుగుతున్నది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేర్చుకునే వారికి ఒక్కరికి 300 రూపాయలు చేతివృత్తి పనులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి పనిముట్లు మిషనరీలు కొయ్యలు కామన్ స్పెషలిస్ట్ సెంటర్ ఇవ్వాలని కొయ్య బొమ్మల తయారీ వృత్తి పనులు వారు కోరుతున్నారు. జనవరి 10 నుండి ఫిబ్రవరి నెల చివరి వరకు తర్ఫీదు కొనసాగిస్తామని తెలిపారు. బొమ్మలు విక్రయించేందుకు కాళహస్తి తిరుమల తిరుపతి ఒంటిమిట్ట గండి దేవాలయాలు గుడులు ప్రాంతాలలో విక్రయించేందుకు వీలుగా బొమ్మల స్టాల్ ను ఏర్పాటు చేయాలని కొయ్యబొమ్మల చేతి వృత్తి వారు కోరుతున్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.