Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Film The Goat Life: మార్చి 28న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్…

The Goat Life: మార్చి 28న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్…

by Prakash
the goat life

  • పృథ్వీరాజ్ సుకుమారన్ “ది గోట్ లైఫ్” The Goat Life (ఆడు జీవితం) ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ లాంఛ్,
  • మార్చి 28న పాన్ ఇండియా రిలీజ్ కు వస్తున్న మూవీ…

Follow us on : Facebook, Instagram & YouTube.

“ది గోట్ లైఫ్” The Goat Life (ఆడు జీవితం) సినిమా ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్…

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ Prithviraj Sukumaran నటిస్తున్న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాను వరల్డ్ క్లాసిక్ మూవీ “లారెన్స్ ఆఫ్ అరేబియా”తో పోల్చారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. ఈ ఆస్కార్ విన్నర్ సంగీతాన్ని అందించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మార్చి 10న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సినిమా మార్చి 28న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లోకి రాబోతోంది.

“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

కోవిడ్ పాండమిక్ ను కూడా ఎదుర్కొని…

ఈ సినిమాను ఒక యజ్ఞంలా పూర్తిచేశారు మూవీ టీమ్. ఎడారి లొకేషన్స్ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. కోవిడ్ పాండమిక్ ను కూడా ఎదుర్కొని బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ఇవ్వనుంది.

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
నిర్మాణం – విజువల్ రొమాన్స్
దర్శకత్వం – బ్లెస్సీ

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, …
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన …


Advertisements

You may also like

Our Visitor

026106
Total views : 149926

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.