Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన కాల్వ శ్రీనివాసులు…

ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన కాల్వ శ్రీనివాసులు…

by Prakash
కాల్వ శ్రీనివాసులు

  • ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మురడి శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి నుంచి తెదేపా నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల శంఖారావం ప్రారంభం
  • రాయదుర్గం లో 50 వేల మెజార్టీతో తెదేపా గెలుపు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని డి హీరేహాల్ మండలం మురడి లో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం లో శనివారం తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల దంపతులు పార్టీ నాయకులతో కలిసి 1116 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మురడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కాల్వ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు. తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం ప్రాంత అభివృద్ధికి వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాలవ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గం లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తనకు రాయదుర్గం నియోజకవర్గం నుంచి మూడవసారి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడించారు. 2024 – 29 లో రాయదుర్గం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ తరఫున వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి : గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు….

ముందుగా జీడిపల్లి నుంచి బైరవాని తిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాలను తరలించి కళకళలాడేలా చేస్తానన్నారు. తుంగభద్ర కాలువకు ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు. 2034 లో బొమ్మనహల్ మండలంలోని గుంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి హెచ్ ఎల్ సి జలాలను అందుబాటులోకి తెస్తానన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా 35, 36 ప్యాకేజీలతో రాయదుర్గం నియోజకవర్గంలో సాగునీరు అందించి పంట పొలాలతో సస్యశ్యామలం చేస్తానన్నారు. గుమ్మగట్ట మండలం గోన బావిలో తెదేపా హాయంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బాలికల ఆశ్రమ పాఠశాలను పూర్తిగా నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే డి హీరేహాల్ లో బీసీ బాలికల ఆశ్రమం పాఠశాలను నిర్మిస్తామన్నారు. డి హీరేహల్ మండలంలో ఒక కొత్త స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బీటీ ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపి బీడు భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేస్తానన్నారు. ఆవుల దట్ల బ్రాంచ్ కెనాల్, మాల్యం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి త్వరగా సాగునీరు అందిస్తానన్నారు. రాయదుర్గం పట్టణంలో గార్మెంట్స్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మురడి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019412
Total views : 90683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.