Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ ను ప్రారంభించిన ప్రధాన మోదీ

తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ ను ప్రారంభించిన ప్రధాన మోదీ

by Satya
Prime Minister inaugurated the first underwater metro tunnel

భారత్‌(India)లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు:

భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు(Metro Rail) పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్‌(West Bengal) రాజధాని కోల్‌కతా(Kolkata) లో నిర్మించిన తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌(Underwater Metro Tunnel) మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఎస్‌ప్లనేడ్‌ నుంచి హావ్‌డా మైదాన్‌ స్టేషన్‌ వరకు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. నదీగర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు పశ్చిమబెంగాల్(West Bengal)లో పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు.

దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు..

దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు(Metro Rail) పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌(Underwater Metro Tunnel) నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు(Metro Rail) కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అధికారులు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: బెంగళూరులో బాంబు పేలుడు..!


భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ …
బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009371
Total views : 62078

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.