Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ..!

ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ..!

by Satya
Jai Bharat National Party Chief Lakshminarayana


గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ(Lakshminarayana) ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జనసేనకు రాజీనామా చేశాక కొంతకాలం రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసిన లక్ష్మీనారాయణ(Lakshminarayana) ఆ తర్వాత సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ(Jai Bharat National Party) స్థాపించారు. ఈసారి ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని లక్ష్మీనారాయణ ప్రకటించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో తమ పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఏపీలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇటీవల జై భారత్ పార్టీ సహా 8 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమికి లక్ష్మీనారాయణ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, జై భారత్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నంద్యాల రాజకీయాల్లో సంచలనం…


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …
కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014464
Total views : 80287

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.