Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

by Satya
Stock markets

దేశీయ స్టాక్‌ మార్కెట్(Stock market) సూచీలు..

నిన్న బేర్ దెబ్బకు కుదేలైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఇవాళ కాస్త పుంజుకున్నాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 89.64 పాయింట్ల లాభంతో 72 వేల 101.69 వద్ద ముగియగా..నిఫ్టీ 21.65 పాయింట్ల లాభంతో 21 వేల 839.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి. మరోవైపు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో.. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫెడ్‌ నిర్ణయాలు రేపటి మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశముందని బిజినెస్ ఎక్స్‌‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023264
Total views : 141690

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.