Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రద్దు..!

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రద్దు..!

by Satya
Pawan Kalyan

జనసేనా(Janasena)ని పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర మరోమారు రద్దయింది. అనకాపల్లి(Anakapalli)లో ఏర్పాటు చేసిన సభ అనంతరం జ్వరం రావడంతో యలమంచిలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పర్యటన రద్దు కావడం ఇదే తొలిసారి కాదు. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పవన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇటీవల ఆయన జ్వరం బారిన పడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దు చేసుకుని వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: సీఎం జగన్ కు ఈసీ నోటీసులు జారీ..!


విశాఖలో కరెన్సీ నోట్ల కుప్ప.
విశాఖపట్నంలో కరెన్సీ నోట్లు కుప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ …
బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తి.
గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ …
పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.
అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారీ వర్షానికి పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో …
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: