కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము (Venigandla Ramu) ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్ , ఏజీకి స్కూల్ మీదగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో వెనిగండ్ల రాముతో పాటు మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లాడని, తాను గెలుపొందితే గుడివాడను 25 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మట్టి మాఫియాగా నాని దోచుకున్నాడని, క్యాసినో, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలతో గుడివాడ నాశనం చేశాడని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
- మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 147295