పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు . ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా. ఇటీవల కాలంలో సంతోష్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అక్రమ మైనింగ్ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, తాజా సోదాల వ్యవహారంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి