Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం

ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం

by Satya
ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం

ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురానుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..
    భారత్‌-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…
  • బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
    విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
  • క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..
    సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
  • చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..
    దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014675
Total views : 80778

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.