ఏపీలో రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రులు, అధికారులతో కూడిన సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సబ్ కమిటీలో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయంపై ప్రకృతి విపత్తుల ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా పంటల బీమా అంశంపై నిర్ణయం తీసుకున్నారు. గత సర్కారు హయాంలో పంటల బీమా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని సబ్ కమిటీ సభ్యులు విమర్శించారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలంటే సరైన పంటల బీమా విధానం అమల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులందరికీ న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న SIR- 2026 కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర సీఈవో సి. సుదర్శన్ రెడ్డి అధికారులతో…
- హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 150412