Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

by Satya
బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఒక వెయ్యి 635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంజనీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పానన్న రేవంత్‌రెడ్డి.. తాను చెప్పినట్టే కేసీఆర్‌ ఉద్యోగం పోయిన తర్వాత.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందన్నారు. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని.. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
  • రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.
    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
  • ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.
    అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
  • సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.
    విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
  • బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.
    హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: