Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home National న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

by Rama
న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం నుంచి ముఖ్యమంత్రి అతిశీ, గ్రేటర్ కైలాశ్ స్థానంలో సౌరభ్ భరద్వాజ్, బాబర్ పూర్ నుంచి గోపాల్ రాయ్, బల్లి మారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. న్యూఢిల్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అక్కడి నుంచి దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అందుకే ఈ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌తోనూ అమీతుమీకు తాము సిద్ధమేననే సంకేతాలను పంపేందుకు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ అధినేత ఎంచుకున్నారు. అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకు మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని వెల్లడించింది. బీజేపీ మిస్సింగ్.. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదంటూ ఆప్ విమర్శలు గుప్పించింది. గత ఐదేళ్లలో కేజ్రీవాల్‌ను తిట్టడం తప్ప, ఢిల్లీ కోసం బీజేపీ ఏమీ చేయలేదని ఆప్ దుయ్యబట్టింది. ఢిల్లీ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న ఆప్‌కే ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019412
Total views : 90683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.