Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు.

by CVR NEWS

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. లేదంటే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని హెచ్చరించారు. దాన్ని పూర్తిగా తెరవకుంటే..ఇరాన్‌లోని పలు విద్యుత్‌ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని..వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్‌ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ తాజా హెచ్చరికలు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: