అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని హెచ్చరించారు. దాన్ని పూర్తిగా తెరవకుంటే..ఇరాన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని..వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.
Tag:






Total views : 141205