Thursday, August 13, 2026
News Navigation
Thursday, August 13, 2026
News Navigation

Breaking

Thursday, August 13, 2026
Home Latest News విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..

విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..

by CVR NEWS
విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్

పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని ఆవిష్కరించారు మంత్రి నారాయణ. ఈ త్రిశూలం మొత్తం ఎత్తు 65 అడుగులు. దీనికి అమర్చిన శివుని ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. సుమారు రూ. 2.5 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ భారీ త్రిశూలాన్ని పూణేకు చెందిన ప్రత్యేక శిల్పులు ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేలా త్రిశూలం లోపల ప్రత్యేక LED దీపాలను అమర్చారు. చీకట్లో ఈ విద్యుత్ కాంతులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సముద్ర తీర ప్రాంతం కావడంతో విశాఖలో తరచూ వచ్చే తుపాన్లు, ప్రచండ గాలులను సైతం తట్టుకుని నిలబడేలా అత్యంత పటిష్టంగా దీని నిర్మాణం చేపట్టారు. కైలాసగిరిపై ఇప్పటికే శివపార్వతుల భారీ విగ్రహాలు ఉండగా, తాజాగా ఈ నూతన త్రిశూల ఏర్పాటుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: