Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

by CVR NEWS
మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా నిషేధించామన్నారు. మూగజీవాలను తరలించేటప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, కౌస్లాటర్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిఘాకు జిల్లాలో ఏడు శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇదే సమయంలో గోరక్షక్ పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు దిగినా, వాహనాలు ధ్వంసం చేసినా ఊపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని డీసీపీ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: