Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

by CVR NEWS
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని..అందుకే విజయ్‌ గెలిచారని అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్న తలైవా.. డీఎంకే అధినేత స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు విజయ్‌ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్‌ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లేదని.. తమ ఇద్దరి వయసులో 25 ఏళ్ల తేడా ఉందన్నారు. కమల్‌ హాసన్‌ సీఎం అయితే అసూయ పడతాను గానీ, విజయ్‌ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014817
Total views : 81081

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.