Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home National బీజేపీ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర విమర్శలు..

బీజేపీ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర విమర్శలు..

by CVR NEWS
బీజేపీ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర విమర్శలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన రైతుగోస బిజెపి భరోసా కార్యక్రమం రైతు గోస కాదు బిజెపి గోస అని, రైతులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ఈ యాత్ర చేపట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ తీవ్రంగా విమర్శించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టినప్పటికీ తాము ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైచిలుకు కొనుగోలు చేసి రైతులకు అండదండగా ఉన్నామని, ఇంత చేస్తున్నా బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని రైతుల పక్షంగా నిలదీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కృత్రిమ రాజకీయం చేస్తన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ధాన్యం చివరికి గింజ వరకు కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కళ్ళల్లోకి ఎక్కడికి వెళ్ళినా రైతులు తమను సాధరంగా ఆహ్వానించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, బిజెపికి పూట గడవక ఈ యాత్రను చేస్తుందని బొజ్జు పటేల్ విమర్శించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: