Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..

తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..

by CVR NEWS
తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం

పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేసి చూపుతారన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ చూపించిన వారిని విమానం ఎక్కిస్తానని నాయుడుపేట మండలం అన్నమేడు జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావు హామీ ఇచ్చారు. ఆయన అన్నట్లుగానే ముగ్గురు విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆయన కూడా తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. టెన్త్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు శశి, యమున, భవితను తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించారు. రేణిగుంట నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత సాయంత్రానికి మళ్లీ రేణిగుంటకు తీసుకెళ్లారు. మొదటిసారి విమానంలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థినులు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావుకు ధన్యవాదాలు తెలిపారు…

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018635
Total views : 89056

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.