Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

by CVR NEWS
మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు

ప్రేమ,పెళ్ళి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ కి చెందిన సంతోష్ మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజీలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న జవహర్ నగర్ కి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అదే అదునుగా భావించిన సంతోష్ ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమా,పెళ్ళి పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అమ్మాయితో దిగిన ఫోటోలను.. ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై బాధితురాలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అక్కడ జీరో FIR చేసి ..మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారని సీఐ సత్యనారాయణ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి..రిమాండుకు తరలించినట్టు మేడ్చల్ ఏసీపీ శంకర్ వెల్లడించారు..

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019142
Total views : 89971

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.