Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..

by CVR NEWS
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్

కర్ణాటకలో సీఎం పీఠం మార్పునకు రంగం సిద్ధమైంది. కర్ణాటక సీఎల్పీ నేతగా.. డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు తెలపడంతో ఆయనే సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో.. కొత్త సీఎంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు.

ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టబోతున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఉన్న గ్లాస్ హౌస్‌లో జూన్ 3వ తేదీన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరగనుంది. మొదట రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ, నగరంలో ట్రాఫిక్ సమస్యలు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు మంత్రులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం సీఎం సతీశన్, సహా కాంగ్రెస్ పెద్దలు హాజరు కానున్నారు.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019200
Total views : 90087

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.