Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

by CVR NEWS
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు

వెలిగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రకాశం జిల్లా డోర్నాల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. టన్నెల్స్‌లోకి వెళ్లిన మంత్రి.. అక్కడ జరుగుతున్న లైనింగ్, టీబీఎం మెషిన్ తొలగింపు పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పనులు నత్తనడకన సాగాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. రాబోయే సీజన్ నాటికి నల్లమలసాగర్‌ను నీటితో నింపేలా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే నిర్వాసితులకు ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్అండ్ఆర్ పరిహారం అందిస్తామని, పునరావాసం కోసం అదనపు బడ్జెట్‌లో రూ.905 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025400
Total views : 147156

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.