Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.

తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.

by CVR NEWS

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 14,43,504 మంది రైతులకు లబ్ది కలిగినట్టయింది. 5,932.23 కోట్ల రూపాయల మేర రుణాల నుండి విముక్తి కలగనుంది. ప్రతీ రైతుకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: