Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Crime అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

by CVR NEWS
అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం

ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ‘తులసి ట్రావెల్స్’బస్సు.. రేగుపాలెం జంక్షన్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా కిందకు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. మరోవైపు బస్సులో మంటలకు సంబంధించిన సమాచారమందుకున్న ఫైర్‌ సిబ్బంది..వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు. ఐతే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగుండొచ్చని భావిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: