Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Film అల్లు అర్జున్‌ ఇవాళ కోర్టుకు వెళ్తారా అన్నదానిపై ఆసక్తి.

అల్లు అర్జున్‌ ఇవాళ కోర్టుకు వెళ్తారా అన్నదానిపై ఆసక్తి.

by CVR NEWS
అల్లు అర్జున్‌ ఇవాళ కోర్టుకు వెళ్తారా అన్నదానిపై ఆసక్తి

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఇవాళ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పుష్ప 2 రిలీజ్‌ టైమ్‌లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌ సమన్లు జారీ చేసింది. ఇవాళ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతారా..లేదంటే క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌ సమయంలో సంధ్యా థియేటర్‌కు వచ్చిన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. తగిన భద్రతా అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకపోవడం, సమన్వయ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తు తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఆ ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఇవాళ విచారణకు స్వయంగా హాజరు కావాలని అల్లు అర్జున్‌తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: