ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్లలచెరువు – కామేపల్లి గ్రామాల మధ్య వేగంగా వచ్చిన ఒక లారీ, ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా పల్నాడు జిల్లా వినుకొండ మండలం వేల్పూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా వేల్పూరు గ్రామం నుంచి నరసరావుపేటలో జరగబోయే ఒక దశ-దిశ కార్యక్రమానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో సంతమాగులూరు మండలం వెల్లలచెరువు – కామేపల్లి మధ్యకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుకొండలు, రమణమ్మలు మృతిచెందారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంతమాగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని తక్షణ చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం.
https://cvrnews.net/accident-news-31/
165
previous post