Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home International UKలో రెండోసారి రెడ్ హీట్ అలర్ట్ జారీ.

UKలో రెండోసారి రెడ్ హీట్ అలర్ట్ జారీ.

by CVR NEWS
UKలో రెండోసారి రెడ్ హీట్ అలర్ట్ జారీ

యూరప్‌ను తీవ్ర ఉష్ణోగ్రతలు అతలాకుతలం చేస్తున్నాయి.. వేసవి ప్రారంభ దశలోనే ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌లో రెండోసారి రెడ్ హీట్ అలర్ట్ జారీ చేయగా, ఆరు ప్రాంతాల్లో హీట్-హెల్త్ వార్నింగ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు స్పెయిన్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జర్మనీలో ఎండల తీవ్రత కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్ సహా అనేక యూరోపియన్ దేశాలు కూడా హీట్ అలర్ట్‌లు ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. తీవ్రమైన వేడి ప్రభావంతో రవాణా వ్యవస్థలు దెబ్బతింటుండగా, నీటి సరఫరాపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పవర్ గ్రిడ్‌లపై భారం అధికమవుతోంది. వాతావరణ మార్పుల ప్రభావమే ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భవిష్యత్‌లో మరింత తీవ్రమైన వాతావరణ సవాళ్లకు సంకేతంగా కనిపిస్తున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: