175
అమెరికాలో డిపోర్టేషన్ నిబంధనలకు మరింత బలం చేకూరేలా యూఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉంటే శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డు హోల్డర్లను కూడా దేశం నుంచి బహిష్కరించవచ్చని స్పష్టం చేసింది. అలాగే అలాంటి వ్యక్తులకు అమెరికాలో ప్రవేశాన్ని ఎంట్రీ పాయింట్ల వద్దే నిరాకరించే అధికారాలను ప్రభుత్వానికి సమర్థించింది. నకిలీ ట్రేడ్‌మార్క్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చైనా జాతీయుడు, గ్రీన్‌కార్డు హోల్డర్ మక్ చోయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.