Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

by CVR NEWS
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలని పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు.. రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన పండుగ ఏరువాక అని వివరించారు. పాడిపంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులు జమ చేసి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు ముఖ్యమంత్రి. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని సూచించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి, మన భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగులో సిరులు పండించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: