Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh గోదావరి ఉధృతితో కొత్త నరసాపురం జలదిగ్బంధం.

గోదావరి ఉధృతితో కొత్త నరసాపురం జలదిగ్బంధం.

by CVR NEWS

గోదావరి వరద ఉధృతి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. నరసాపురం మండలం కొత్త నవరాసపురంలోని యానాదుల కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, ఆహారం వంటి కనీస అవసరాల కోసం అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ తమ కాలనీని సందర్శించి సమస్యలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి సురక్షిత తాగునీరు, నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు వరద ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా జిల్లా ప్రతినిధి ఆనంద్ కుమార్ అందిస్తారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: