Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.

by CVR NEWS

సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా తాజా పర్యటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు సాగనున్న టూర్‌లో భాగంగా నేడు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ, మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన కేంద్ర నిధులు, అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అంశాలపై మంత్రులతో భేటీ కానున్నారు. చివరగా ఆయన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయి రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: