Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Crime ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.

by CVR NEWS

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. థాయ్‌లాండ్‌ నుంచి ఇండియాకు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు అతని నుంచి రెండు కోట్లకు పైగా విలువైన సుమారు 2.759 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ గ్రీన్ ఛానల్ దాటి వెళ్తున్న సమయంలో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు అడ్డుకున్నారు. లగేజీని ఎక్స్-రే స్క్రీనింగ్ చేయగా, అందులో 4 వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. బటయకు కిట్‌క్యాట్ చాక్లెట్ బ్యాక్సుల్లా కనిపించే వాటిని ఓపెన్ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న హైడ్రో ఫోబిక్ గంజాయిని గుర్తించారు.దీంతో నిందితుడిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: